Taj Mahal: తాజ్ మహల్ లో ఎప్పటికీ తెరవకూడని గది ఉందని తెలుసా.. దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే..!

by Prasanna |
Taj Mahal: తాజ్ మహల్ లో ఎప్పటికీ తెరవకూడని గది ఉందని తెలుసా.. దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో ఎన్నో రహస్యాలు.. వాటిలో కొన్ని మనకీ తెలిసినవి, ఇంకొన్ని తెలియనవి ఉన్నాయి. పరిశోధకలు ఎప్పటికప్పుడు వాటిని చేధిస్తూనే ఉన్నారు అయినా అంతుబట్టడం లేదు. ప్రపంచం ముందుకు వెళ్లే కొద్దీ రహస్యాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని ద్వారాలు, వాటి రహస్యాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే, ఇవి దశాబ్దాల నుంచి ఇవి మూసే ఉన్నాయి. పొరపాటున వాటిని తెరిచే ప్రయత్నం చేస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందనే భయం కూడా వెంటాడుతోంది. మరి, దానిలో తాజ్ మహల్ కు ఎందుకు చేరిందో ఇక్కడ తెలుసుకుందాం..

తాజ్ మహల్ ( Taj Mahal ) భారత దేశానికి మకుటం లాంటిది. ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటు చేసుకున్న ఈ అద్భుతం దేశంలోని ఆగ్రా లో ఉంది. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా పేరు గాంచింది. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం నిర్మించాడని చెబుతారు. ఇది అందానికి, సౌందర్యానికి ఎంత పేరు గాంచిందో .. అంతుపట్టని రహస్యాలకు కూడా అంతే ప్రసిద్ధి చెందింది. కొన్ని విషయాలు గురించి వింటే షాక్ అవ్వకుండా ఉండలేరు. పరిశోధకుల పరిశోధనల ప్రకారం తాజ్ మహల్ బేస్ మెంట్ కింద ఒక అంతుచిక్కని గది ఉంది. అది మార్బుల్ తో తయారు చేయబడింది.

తెలిసిన సమాచారం ప్రకారం, కార్బన్ డై ఆక్సైడ్ ఆ గదిని పూర్తిగా ఆవరించి ఉంది. మార్బుల్ తో తయారు చేయడం వలన ఆ కార్బన్ డై ఆక్సైడ్ , క్యాల్షియం కార్బోనేట్ గా మారి, మార్బుల్ ని పిండి పౌడర్ లాగా తయారు చేస్తుంది. దీని వల్ల తాజ్ మహల్ కు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. తాజ్ మహల్ ను కాపాడుకోవడం కోసమే ఆ గదిని శాశ్వతంగా మూసివేశారు. అక్కడకి ఎవర్ని వెళ్లనివ్వరు.

Advertisement

Next Story