స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి విద్యార్థి మృతి

by Kalyani |
స్విమ్మింగ్ పూల్ లో నీట మునిగి విద్యార్థి మృతి
X

దిశ, శంకర్ పల్లి : తోటి విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఓ విద్యార్థి స్విమ్మింగ్ ఫూల్ లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండకు చెందిన రఫియా గులాం రసూల్ అన్సారీల కుమారుడు ఫైజాన్ అన్సారి (11) జాన్ హుమా లోని మదీనా మిషన్ హై స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. గురువారం రోజు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామ శివారులోని ఫామ్ ఎగ్జోటికా( వైల్డ్ వాటర్)కు విహారయాత్రకు వచ్చారు.

వైల్డ్ వాటర్ లోని అలలతో కూడిన స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు నీట మునిగాడు. వెంటనే సహచర విద్యార్థులు ప్రమాదానికి గురైన ఫైజన్ అన్సారీని బయటకు తీసుకొచ్చారు. పామ్ ఎగ్జిటికా సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం శంకర్ పల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బాలుడు మృతి చెందిన విషయం కుటుంబీకులకు సమాచారం అందడంతో వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విహారయాత్రకు వచ్చిన కొడుకు అకాల మరణంతో తల్లిదండ్రులను బోరును వినిపించారు. మృతుని తండ్రి గులాం రసూల్ అన్సారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శంకరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story