- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మొదలైన రద్దీ
దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ(Sankranti festival) వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి తెలుగు వారు కుటుంబాలతో సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఏపీ(Andhra Pradesh)లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ఇచ్చారు. దీంతో సొంతూళ్లకు కుటుంబంతో సహా ప్రజలంతా బయల్దేరారు.
విజయవాడలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. నగరంలోని నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్(Hyderabad) నుంచి విజయవాడకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోస్తా జిల్లాలకు, ఉత్తరాంధ్రకు వెళ్లేవారు ఎక్కువమంది ఉండటంతో అధికారులు విజయవాడ(Vijayawada) నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇందులో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు.