Gadkari : రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కొత్త పథకం : గడ్కరీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-08 07:49:45.0  )
Gadkari : రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కొత్త పథకం : గడ్కరీ
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన(Injured In Road Accidents) బాధితులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం(Narendra Modi Government) కొత్త నగదు రహిత వైద్య వసతి పథకాన్ని ప్రకటించింది. దీనికి ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ స్కీమ్’‘(Cashless Treatment Scheme)గా నామకరణం చేసినట్లు తెలిపిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Gadkari)వెల్లడించారు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని గడ్కరి వెల్లడించారు.

ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే, చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇప్పటికే అస్సాం, పంజాబ్, హర్యానా, పుదుచ్చేరిలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి పూర్తి స్థాయిలో దేశమంతటా ఈ స్కీమ్ అందుబాటులోకి రానుందని గడ్కరీ తెలిపారు. ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు ఏడు రోజుల పాటు చికిత్స అందించనున్నట్లుగా తెలిపారు.

అయితే ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ రోడ్డు ప్రమాదాల్లో బాధితుడు చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం, ప్రమాద సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడిన వ్యక్తికి రూ.5 వేల వరకు రివార్డు ఈ పథకం ద్వారా అందించనున్నట్లుగా తెలిపారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.. నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి.. దీనిని నిరంతరం మెరుగుపరుస్తూ వస్తోందన్నారు.

రోడ్డు భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గడ్కరీ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో మంగళవారం దిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. రోడ్డు రవాణా సంబంధిత పాలసీలపై వారితో కేంద్ర మంత్రి చర్చించారు. అనంతరం ఈ కొత్త పథకాన్ని గడ్కరీ ప్రకటించారు.

2024 సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది చనిపోవడం ఆందోళన కలిగించే విషయమని.. వీటిలో 30వేల మరణాలు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు ప్రమాదాల బారినపడిన వారిలో దాదాపు 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపు యువతే ఉన్నారని తెలిపారు.

విద్యాసంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ లేకపోవడం వల్ల గతేడాది దాదాపు 10 వేల మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల బారినపడ్డారన్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. అందుకే ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం కొత్త నియమాలను అమల్లోకి తేవాల్సి వచ్చిందని గడ్కరీ తెలిపారు.

అలాగే నేను పదవిలో ఉన్నంత వరకు దేశంలో డ్రైవర్లు లేని కార్లను అనుమతించనని గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఆ కార్లు దేశంలోకి వస్తే దాదాపు 80 లక్షల మంది డ్రైవర్లు రోడ్డున పడతారన్నారు.

Advertisement

Next Story

Most Viewed