AAP Leaders: ఢిల్లీ సీఎం నివాసం వద్ద హైడ్రామా.. ఆప్ నేతలను అడ్డుకున్న పోలీసులు

by Shamantha N |
AAP Leaders: ఢిల్లీ సీఎం నివాసం వద్ద హైడ్రామా.. ఆప్ నేతలను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం నివాసం(Delhi Chief Minister Residence) దగ్గర హైడ్రామా నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ(BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సీఎం అధికారిక బంగ్లాను విలాసవంతంగా అప్‌గ్రేడ్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రజాధనాన్ని ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ‘నిజాన్ని చూపిస్తాం’ అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియా ప్రతినిధులతో కలిసి బంగ్లాకు చేరుకున్నారు. అయితే, శాంతిభద్రతల సమస్య కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు ఆందోళన చేపట్టారు. "మమ్మల్ని లోపలికి ఎందుకు అనుమతించడం లేదు? గోల్డెన్ టాయ్ లెట్, స్విమ్మింగ్ పూల్, మినీబార్ ఉన్నాయని బీజేపీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తోంది. అవెక్కడున్నాయో మాకు, మీడియాకు చూపించండి. మమ్మల్ని ఆపేందుకు మీకు ఎవరు దిశానిర్దేశం చేశారు?" అని ఆప్ నేతలు మండిపడ్డారు. మమ్మల్ని ఆపడం మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆప్ నేతలను అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, వాటర్ క్యానన్లను మోహరించారు. కేవలం ఇద్దరు వ్యక్తుల కోసం, చాలా మంది పోలీసులు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. సీఎం నివాసాన్ని తెరిచి మమ్మల్ని లోపలికి అనుమతించాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed