- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MSMEs: ఎంఎస్ఎంఈల పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను నోటిఫై చేసిన కేంద్రం

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థికవ్యవస్థకు కీలకమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్‌లో కీలక చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎంఎస్ఎంఈల ప్రమాణాలకు సంబంధించి పెట్టుబడి పరిమితి, టర్నోవర్ లిమిట్‌ను పెంచారు. దీనికి సంబంధించి తాజాగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఎంఎస్ఎంఈల వర్గీకరణను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం, రూ.2.5 కోట్ల వరకు పెట్టుబడులు(గతంలో రూ. కోటి), రూ.10 కోట్ల వార్షిక టర్నోవర్(గతంలో రూ. 5 కోట్లు) కలిగిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు. అలాగే, రూ.25 కోట్ల పెట్టుబడులు(గతంలో రూ. 10 కోట్లు), రూ.100 కోట్ల టర్నోవర్(గతంలో రూ. 50 కోట్లు) ఉన్నవాటిని చిన్న పరిశ్రమలు, రూ.125 కోట్ల పెట్టుబడులుగతంలో రూ. 50 కోట్లు), రూ.500 కోట్ల టర్నోవర్(గతంలో రూ. 250 కోట్లు) ఉన్న వాటిని మధ్య తరహా పరిశ్రమల పరిధిలోకి రానున్నాయి.