లక్నో.. గుర్తుందా లాస్ట్ సీజన్

by John Kora |
లక్నో.. గుర్తుందా లాస్ట్ సీజన్
X

- నేడు సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో

- గతేడాది లక్నోను చితక్కొట్టిన హెడ్, శర్మ

- ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో సన్‌రైజర్స్

- తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న లక్నో

- గెలుపెవరిది?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ నుంచే రికార్డులు సృష్టించడం మొదలు పెట్టిన సన్‌రైజర్స్.. కెప్టెన్‌ను మార్చినా ఫలితాన్ని మార్చలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్. ఈ రెండు జట్లు ఇవ్వాళ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. నిరుడు ఈ రెండు జట్లు తలపడిన లీగ్ మ్యాచ్‌లో సర్‌రైజర్స్ ఓపెనింగ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ రెండు జట్లు అభిమానులకు గుర్తే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి రెండు జట్లు 2025 సీజన్‌లో తొలి సారి తలపడనుండటం ఆసక్తికరంగా మారింది.

ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడిన సన్‌రైజర్స్ జట్టు రికార్డు విజయాన్ని సాధించింది. ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్ సాధించడమే కాకుండా.. 44 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో హైదరాబాద్ జట్టు మెరుగైన రన్‌రేట్ సాధించింది. ఓపెనర్లు అభిషేర్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫామ్‌లో ఉన్నారు. అయితే కొత్తగా జట్టులో చేరిన ఇషాన్ కిషన్ తన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ప్రత్యర్జులకు హెచ్చరికలు పంపాడు. నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ తమదైన శైలిలో రాణించారు. దీంతో మొదటి మ్యాచ్‌లోనే దాదాపు రికార్డులు ఛేధించినంత పని చేసింది. అయితే హైదరాబాద్ జట్టు బౌలింగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడానికి చాలా కష్డపడ్డారు. ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోర్ సాధించింది కాబట్టి గెలవగలిగింది. లేకపోతే 200+ స్కోర్‌ను కూడా సన్‌రైజర్స్ ఆపే పరిస్థితి కనపడలేదు. అందుకే అభిమానులు జట్టు బౌలింగ్‌పై ఆందోళన చెందుతున్నారు. మహ్మద్ షమి వంటి అంతర్జాతీయ బౌలర్ కూడా ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో గెలిచే అవకాశాలు ఉన్నా.. కెప్టెన్ పంత్ స్టపింగ్ మిస్ చేయడంతో ఓడిపోక తప్పలేదు. అయితే లక్నో జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉంది. కేవలం ఫీల్డింగ్ కారణంగా జట్టు ఓడిపోవాల్సి వచ్చింది తప్ప పెద్దగా లోపాలేవీ లేవు. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ ఆడిన దూకుడైన ఇన్నింగ్స్ లక్నో జట్టు తలరాతను మార్చింది. అయితే లక్నోలో సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, బౌలర్లు మణిమారన్, దిగ్వేష్‌లు ఉండటం కలసి రానుంది. ఎల్ఎస్‌జీ బ్యాటింగ్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్.. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ కీలకంగా ఉన్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తమది గాలివాటం కాదని హైదరాబాద్ నిరూపించుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి విజయం కోసం లక్నో తీవ్రంగా శ్రమించనుంది.

జట్ల అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (సి), ఇషాన్ కిషన్ (వి.కీ), అథర్వ తైదే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, వియాన్ ఎ ముల్డర్, అభిషేక్ కుమార్, నితీష్‌కుమార్, నితీష్‌కుమార్, నితీష్‌కుమార్, చమ్మెదమ్ శర్మ సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (c&wk), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, ఆర్యన్ జుయల్ (Wk), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్ (wk), మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగర్, అర్హిన్ హంగర్, యువరాజ్ అహ్మద్ శార్దూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, ఆకాష్ దీప్, మణిమారన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, ఆకాశ్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్.

హెడ్ టూ హెడ్ : సన్‌రైజర్స్ - 1, లక్నో - 3

పిచ్ రిపోర్ట్ : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫాస్ట్ అండ్ స్పిన్ బౌలర్స్‌లో ఎవరికి పెద్దగా సహకారం అందదు. ఇక్కడ 250+ స్కోర్లు కూడా నమోదయ్యాయి.

Next Story

Most Viewed