భారత నం.1 డబుల్స్ ప్లేయర్‌గా యుకీ బాంబ్రీ

by Harish |
భారత నం.1 డబుల్స్ ప్లేయర్‌గా యుకీ బాంబ్రీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత నం.1 టెన్నిస్ డబుల్స్ ప్లేయర్‌గా యుకీ బాంబ్రీ అవతరించాడు. ఆరేళ్లుగా భారత టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్న రోహన్ బోపన్న వెనక్కినెట్టాడు. ఫ్లోరిడాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో రోహన్ బోపన్నను ఓడించడం ద్వారా యుకీ బాంబ్రీ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో నూనూ బోర్గెస్(పోర్చుగల్)తో కలిసి యుకీ బాంబ్రీ 6-4, 3-6, 10-7 తేడాతో బోపన్న-ఇవాన్ డోడిగ్(క్రోయేషియా) జంటపై విజయం సాధించాడు. ఈ గెలుపు యుకీ బాంబ్రీ లైవ్ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్‌లో నిలిచాడు. బోపన్న ఏకంగా 22 స్థానాలు దిగజారి 43వ ర్యాంక్‌కు పడిపోయాడు. 2019 నుంచి బోపన్న భారత నం.1 డబుల్స్ ప్లేయర్‌గా ఉన్నాడు. దాదాపు 286 వారాల బోపన్న ఆధిపత్యానికి యుకీ బాంబ్రీ చెక్ పెట్టాడు.


Next Story