Jai shanker: భవిష్యత్‌లోనూ భారత్ చైనాల మధ్య సమస్యలు.. విదేశాంగ మంత్రి జైశంకర్

by vinod kumar |
Jai shanker: భవిష్యత్‌లోనూ భారత్ చైనాల మధ్య సమస్యలు.. విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ చైనా (india china) మధ్య నెలకొన్న సానుకూల సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండియా, చైనాల మధ్య సమస్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కానీ వివాదం నెలకొనకుండా వాటిని పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎన్జీఓ ఆసియా సొసైటీతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఇరు దేశాల మధ్య భవిష్యత్‌లో సమస్యలు ఉంటాయని తెలుసు. కానీ వాటిని పరిష్కరించడానికి అనేక మార్గలుంటాయి. 2020లో జరిగిన ఘర్షణ మాత్రం మార్గం కాదు’ అని వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్ నుంచి భారత్, చైనాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయని తెలిపారు.

దశల వారిగా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 2020లో జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలమో లేదో చూస్తామన్నారు. పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి రెండు దేశాలు కృషి చేస్తున్నాయని నొక్కి చెప్పారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రక్షణ, ఇంధనం, సాంకేతికత వంటి కీలకమైన రంగాల్లో ఇండియాతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి వైట్ హౌస్ మరింత సిద్ధంగా ఉందని చెప్పారు. దేశ ప్రయోజనాల గురించి తెలుసుకుని ఉత్తమమైన ఒప్పందాన్ని ఖరారు చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Next Story