ఇకపై మైనర్లూ సేవింగ్స్ ఖాతాలు తెరవచ్చు.. ఆర్బీఐ కీలక సర్క్యూలర్

by Ramesh Goud |
ఇకపై మైనర్లూ సేవింగ్స్ ఖాతాలు తెరవచ్చు.. ఆర్బీఐ కీలక సర్క్యూలర్
X

దిశ, వెబ్ డెస్క్: మైనర్లు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్ తెరవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) తెలిపింది. ఈ మేరకు కొత్త సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పింది. ఇంతవరకు మైనర్లు (Minors) వారి సంరక్షుల ద్వారా పోదుపు ఖాతాలు తెరవడానికి, నిర్వహించడానికి మాత్రమే వీలు ఉండేది. రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలు పైబడిన మైనర్లు సంరక్షులతో అవసరం లేకుండా పొదుపు (Savings), ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను (Fixed Diposit Accounts) ఓపెన్ చేయడమే గాక వాటి నిర్వహణ బాధ్యత కూడా మైనర్లే చూసుకోవచ్చని తెలిపింది. ఆర్బీఐ సర్క్యూలర్ (RBI Circular) ప్రకారం వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులలో ఏ వయస్సు వారైనా వారి సంరక్షకుల ద్వారా పొదుపు, డిపాజిట్ ఖాతాలు తెరవడానికి, నిర్వహణకు అనుమతించవచ్చని పేర్కొంది.

ప్రస్తుత సవరణ ప్రకారం.. బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌‌మెంట్ ను దృష్టిలో ఉంచుకొని షరతులు విధించుకోవచ్చని, కానీ ఖాతాదారుడికి వాటి గురించి తెలియజేయాలని తెలిపింది. దీంతో బ్యాంకులు మైనర్ ఖాతాదారులకు వారి రిస్క్ మేనేజ్‌మెంట్ విధానం ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు (Internet Banking), ఏటీఎం (ATM), చెక్ బుక్ (Check Book) వంటి అదనపు సౌకర్యాలను కూడా అందించవచ్చని సర్క్యూలర్ లో తెలిపింది. అంతేగాక బ్యాంకులు స్వతంత్రంగా లేదా సంరక్షకుడి ద్వారా నిర్వహించబడుతున్న మైనర్ ఖాతాలను ఓవర్ డ్రా చేయకుండా.. బ్యాలెన్స్ కొనసాగించేలా చూసుకోవాలని సూచించింది. ఇక మైనర్లు డిపాజిట్ ఖాతాలు తెరిచే విధంగా బ్యాంకులు శ్రద్ధ చూపాలని సలహా ఇచ్చింది. అలాగే కొత్త నిబంధనలు ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఆర్బీఐ (RBI) పేర్కొంది.



Next Story

Most Viewed