Modi vance: మోడీతో జేడీ వాన్స్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్

by vinod kumar |
Modi vance: మోడీతో జేడీ వాన్స్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (Jd vance) తో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోడీ అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాలలో సహకారాన్ని పెంపొందించడంపై డిస్కస్ చేశారు. అలాగే ద్వైపాక్షిక సహకారంలో భాగంగా వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షించి సానుకూలంగా వాటి పరిణామాలను అంచనా వేసినట్టు తెలుస్తోంది.

ఇరు దేశాల ప్రజల సంక్షేమంపై దృష్యా పరస్పర ప్రయోజనకరమైన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై గణనీయమైన పురోగతిని సాధించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. అలాగే ప్రాంతీయ, ప్రపంచ సమస్యపైనా ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు వెల్లడించింది. భేటీ అనంతరం చర్చల వాన్స్ ఆయన భారత భార్య ఉషా చిలుకూరి, సీనియర్ యూఎస్ ప్రతినిధులకు మోడీ విందు ఏర్పాటు చేశారు. కాగా, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. దీనిలో సుంకం, వాణిజ్య సమతుల్యత, మార్కెట్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, వాన్స్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వాన్స్‌కు ఘనస్వాగతం

జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి సోమవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగగానే వారికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అలాగే వాన్స్ ముందు కళాకారులు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి వెళ్లారు. సుమారు గంట సేపు అక్కడ సరదాగా గడిపారు. కాగా, జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. అంతేగాక 12 ఏళ్ల తర్వాత భారత్ ను సందర్శించిన తొలి యూఎస్ ఉపాధ్యక్షుడు సైతం వాన్సే కావడం గమనార్హం.



Next Story

Most Viewed