పవన్ ఇలాకలో సామరస్యంగా ముగిసిన సమస్య

by srinivas |
పవన్ ఇలాకలో సామరస్యంగా ముగిసిన సమస్య
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం నియోజకవర్గం(PithapuramConstituency) మల్లాం గ్రామం(Mallam Village)లో చోటు చేసుకున్న సమస్య సామరస్యపూర్వకంగా ముగిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు సురేష్ బాబు విద్యుత్ పని చేస్తూ విద్యుతాఘాతంతో మృతి చెందారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఎస్సీలను సామాజిక బహిష్కరణ చేశారనే వార్తలు ఆదివారం రాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీస్, వెల్ఫేర్ శాఖల అధికారులు ఆ గ్రామం సందర్శించారు. శాంతి కమిటీ ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస రావు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, పార్టీ జిల్లా కార్యదర్శి, ఎస్సీ నేత పిట్టా జానకి రామయ్య, ఏఎంసీ ఛైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, ఎస్సీ నేత బి.ఎన్.రాజు తదితరులు బాధిత వర్గాలతోను, అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరూ సోదర భావంతో కలసి ఉండాలన్నదే పవన్ కల్యాణ్ ఆశయమని, అందుకే పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం అనే సిద్ధాంతం పేర్కొన్నారని తెలిపారు. మల్లాంలో సమస్యను సామరస్యంగా పరిష్కారం అయిందనీ, దీనిపై ఎవరు రాజకీయ కుట్రలు చేసినా అందరూ కలసిమెలసి నిలువరిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed