Virat Kohli : కోహ్లిని పోలిన మరో వ్యక్తి.. వావ్ అంటున్న అభిమానులు

by M.Rajitha |
Virat Kohli : కోహ్లిని పోలిన మరో వ్యక్తి.. వావ్ అంటున్న అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్ : అచ్చం క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat kohli)ని పోలిన ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. కావిట్ సెటిన్ గునేర్ ఒక టర్కిష్ నటుడు, అచ్చు గుద్దినట్టు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలి ఉండటంతో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జన్మించిన కావిట్ టర్కిష్ టెలివిజన్ రంగంలో పనిచేస్తూ, ముఖ్యంగా "దిరిలిస్: ఎర్టుగ్రుల్" అనే హిట్ సిరీస్‌లో నటించడం ద్వారా పాపులర్ అయ్యాడు. దీనితోపాటు కొన్ని టర్కిష్ ప్రాజెక్ట్‌లలో కూడా నటించాడు. వాటిలో "లాంగ్ టైమ్ అగో", "బీ విట్‌నెస్ డాక్యుమెంటరీ" వంటివి ఉన్నాయి.

అయితే అతను నటించిన "దిరిలిస్: ఎర్టుగ్రుల్" సిరీస్ లో డోగన్ బే అనే పాత్రను పోషించాడు. ఈ సిరీస్‌లో అతని గడ్డం, ముఖ లక్షణాలు అచ్చం విరాట్ కోహ్లీలా ఉండటం విశేషం. 2020లో పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ అమీర్ ఈ సిరీస్ చూస్తూ కావిట్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, కోహ్లీతో పోల్చచడంతో ఈ విషయం వైరల్ అయింది. దీంతో కావిట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ ఫోటోలను చూసిన కోహ్లీ అభిమానులు అచ్చం కోహ్లీకి ట్విన్ బ్రదర్ లా ఉన్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మంది వావ్ కోహ్లీకి ఫోటో కాపీ అని పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు.

Next Story