- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎంపీ మల్లు రవి ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన, రాబందు పాలన అని, ,జైల్లో ఉండాల్సిన ఆయన హోం మినిస్టర్ గా చీఫ్ మినిస్టర్ గా ఉండటం దురదృష్టం అని మాట్లాడటం సరైందిన కాదని నాగ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో ఉండి కేసీఆర్ రాక్షసుడని, అతనిది రాక్షస, రాబందుల పాలన అని ఆరోపణలు చేసిన విషయాన్ని మల్లు రవి గుర్తు చేశారు. నాడు బీఆర్ఎస్పాలనను ఒకసారి చూడు.. నేటి ప్రజా పాలన చూసి మాట్లాడాలని ఈ సందర్భంగా మల్లు రవి ఆర్ఎస్ప్రవీణ్కు సూచించారు.
అనాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అపాయింట్మెంట్ కోసం అడిగితే వారికి మూడు నెలలు అయినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయనే వ్యాఖ్యనించారని తెలిపారు. ఈనాడు కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పునరుద్ధరించారని పేర్కొన్నారు. మొట్టమొదటి రోజే ప్రజా భవన్ ముందర ఉన్న ముళ్ల కంచెను తొలగించారని, ప్రజాభవన్ లో మామూలు ప్రజలు వెళ్లి వారి కష్టసుఖలపై అప్లికేషన్ ఇస్తున్నారని, అధికారంలోకి రాగానే మహిళలందరికీ బస్సులు ఉచితంగా తిరిగే సౌకర్యం కల్పించారని చెప్పారు. ఆర్ఎస్ప్రవీణ్కుమార్చెబుతున్నట్లు అప్పటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకి ఆకాశానికి.. భూమికి ఉన్నంత తేడా ఉందని హెద్దెవ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువుకున్న నాయకులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ తెలిసిన వ్యక్తి, కేటీఆర్, హరీష్, కవిత ఇచ్చిన మాదిరి స్టేట్మెంట్ ఇవ్వొద్దు అని ఎంపీ మల్లు రవి సూచించారు.