పోలవరంపై ఫోకస్.. ప్రాజెక్టు వద్దకు సీఎం

by srinivas |   ( Updated:2025-03-27 03:28:32.0  )
పోలవరంపై ఫోకస్.. ప్రాజెక్టు వద్దకు సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నీటి సమస్యలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. నీటి ఎద్దడిపై అధికారులకు కీలక సూచన చేసిన ఆయన.. పోలవరాన్ని సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం రూ. 10.45 నిమిషాలకు అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీయనున్నారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నీటి అవసరాలపై చర్చించనున్నారు.

కాగా గతంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగంగా చేపట్టారు. డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. అయితే జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో డయా ఫ్రమ్ వాల్ వరదలో కొట్టుకుపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం డయా ఫ్రమ్ వాల్ నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రూ. 990 కోట్లు కేటాయించింది. అటు ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12,157 కోట్లు ప్రకటించడం కలిసి వచ్చింది. ఇప్పటి వరకూ ప్రాజెక్టుకు రూ.5052 కేట్లు అడ్వాన్స్‌గా వచ్చాయి. 2027 డిసెంబర్ నాటి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేలా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకోనున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed