- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Canada: దేశంలో ముందస్తు ఎన్నికలు.. ప్రకటించిన ప్రధాని

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కెనడా (Canada) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ (Mark Carney) దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 28న కెనడాలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆదివారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి కెనడియన్ల నుంచి తనకు బలమైన మద్దతు కావాలని తెలిపారు. ‘కెనడాను సురక్షితంగా ఉంచడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. దేశంలో పెట్టుబడులు పెట్టడం, కెనడాను ఏకం చేయడమే నా లక్ష్యం. అందుకే నా తోటి కెనడియన్ల నుంచి బలమైన సానుకూల ఆదేశాన్ని అడుగుతున్నా. పార్లమెంట్‌ను రద్దు చేసి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించా’ అని తెలిపారు. తన అభ్యర్థనకు గవర్నర్ జనరల్ అంగీకరించినట్టు చెప్పారు.
కాగా, కెనడాలో అక్టోబర్ 20 నాటికి సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తనకు లభించిన అపూర్వ మద్దతను ఉపయోగించుకోవాలని కార్నీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపారు. జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడం, సుంకాలతో ట్రంప్ బెదిరిస్తున్న క్రమంలోనే కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అమెరికా సుంకాలకు తగిన సమాధానం ఇవ్వడమే గాక మరికొన్ని దేశాలతో తన సంబంధాలను కూడా సమీక్షించబోతుందని పలువురు భావిస్తున్నారు. కెనడియన్ పౌరుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి కార్నీకి ఇప్పుడు ఐదు వారాల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు నిలుస్తారో వేచి చూడాల్సిందే.