Ap News: విశాఖ అభివృద్ధికి రూ.500 కోట్లు?

by srinivas |   ( Updated:2025-03-23 17:40:48.0  )
Ap News: విశాఖ అభివృద్ధికి రూ.500 కోట్లు?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూల్, స్టీల్ సిటీ ఏది అని అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఈ సిటీ కూల్ ప్రాంతం కావడంతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ పోర్టు, నేవీతో పాటు ప్రభుత్వ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం ఉన్నాయి. దీంతో అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే విశాఖ పేరు ముందు వినిపిస్తుంది. జనాభా విషయంలోనూ ముందు వరుసలో ఉంది.

దీంతో ఈ సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి అడుగులు వేస్తోంది. త్వరలో మెట్రో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటు విశాఖ నగర విస్తరణ, రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. 2041 అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో 35కు పైగా రోడ్ల నిర్మానాలు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. బోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు కేంద్రంగా విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతర్గత రహదారులను నిర్మించేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇదంతా ప్రతిపాదనల దశలోనే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతోంది.

Next Story

Most Viewed