Paul: పవన్‌కు దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి.. కేఏ పాల్ సంచలన సవాల్

by Ramesh Goud |   ( Updated:2025-01-08 08:02:30.0  )
Paul: పవన్‌కు  దమ్ముంటే దర్యాప్తు జరిపించాలి.. కేఏ పాల్ సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు దమ్ముంటే అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సవాల్ విసిరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదానీ వ్యవహరం(Adani issue) గురించి అమెరికా కోర్టులు సహా అంతర్జాతీయ న్యాయస్థానాలు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. అదానీ అవినీతికి పాల్పడినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు(America Inquiry Agencies) సైతం చెబుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల ప్రస్తుతం ఏపీ ప్రజలపై విద్యుత్ ఛార్జీల బారం పడిందన్నారు. ఈ వ్యవహారం వల్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం పరువు కూడా పోతోందని మండిపడ్డారు. తమ వల్లే దేశంలో ఎన్డీఏ(NDA) అధికారంలోకి వచ్చిందని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదానీ వ్యవహారంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా ధైర్యం(Guts) ఉంటే జగన్- అదానీ చీకటి ఒప్పందాలపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలని కేఏ పాల్ ఛాలెంజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed