ఇట్స్ అఫీషియల్.. 10 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ‘రజాకార్’ మూవీ

by Hamsa |
ఇట్స్ అఫీషియల్.. 10 నెలల తర్వాత  ఓటీటీలోకి వస్తున్న ‘రజాకార్’ మూవీ
X

దిశ, సినిమా: అనసూయ(Anasuya), బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, వేదిక, ఇంద్రజ నటించిన సినిమా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’(Rajakar: The Silent Genocide of Hyderabad). దీనిని యాటా సత్యనారాయణ తెలంగాణ(Telangana) గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను గూడూరు నారాయణ(Gudur Narayana) నిర్మించగా.. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు. అయితే ‘రజాకార్’ చిత్రం విడుదలకు ముందు పలు వివాదాలు ఎదుర్కొని రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఏకంగా కోర్టు వరకు వెల్లగా.. కాస్త సద్దుమనగడంతో గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లో విడుదల చేశారు.

అయితే ‘రజాకార్’ మూవీ థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ విడుదలై ఇన్ని నెలలు అవుతున్నా ఓటీటీలోకి మాత్రం రాలేదు. విడుదలై పది నెలలు పూర్తి కావొస్తున్నా స్ట్రీమింగ్ అందుబాటులోకి రాకపోవడంతో సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘రజాకార్’ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఆహా(Aha) సంస్థ సొంతం చేసుకోగా జనవరి 24 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed