Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనకు అసలు కారణం ఇదే

by Mahesh |
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనకు అసలు కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు చనిపోయిన(Six dead) విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మొత్తం 40 మంది ప్రజలకు తీవ్ర గాయాలు కాగా అందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించారు. తొక్కిసలాటకు గల కారణాలు(Reasons) వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా యదావిధిగా ఏర్పాటు చేశారు. ముందస్తుగానే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. అయితే భక్తులు అనుకున్న దానికంటే అధికంగా ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేచి ఉన్నారు. ఈ క్రమంలో బైరాగి పట్టెడ(Bairagi Patteda) వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అధికారులు వారందరిని పక్కనే ఉన్న పార్క్(Park) లోకి పంపారు.

రాత్రి 8.15 గంటల సమయంలో పార్క్ లో ఉన్న ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వైద్యం కోసం(For healing) అస్వస్థతకు గురైన వ్యక్తిని పార్క్ నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో అధికారులు గేట్లను తెరిచారు. దీంతో క్యూ లైన్లలోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారనుకున్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారు. దీంతో చాలామంది కిందపడిపోవడంతో.. వేనకాల ఉన్నవారు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. కిందపడిన వారు ఊపిరాడక తీవ్ర అస్వస్థత(severe illness)కు గురి కాగా వారిని రుయా(Ruya), స్విమ్స్(Swims) ఆస్పత్రులకు పోలీసులు హుటాహుటిన తరలించారు. కాగా ఆస్పత్రికి చేరుకునే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో నలుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అలాగే స్వల్ప గాయాలతో బయటపడ్డ వారికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేస్తున్నారు.

Advertisement

Next Story