పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయండి : ఎమ్మెల్యే

by Kalyani |
పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయండి : ఎమ్మెల్యే
X

దిశ, చార్మినార్ : పెండింగ్ లో ఉన్న అభివృద్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని యాకుత్ పురా నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అధికారులకు సూచించారు. యాకుత్ పురా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతి, పలు సమస్యలపై గురువారం మధ్యాహ్నం ఆయన జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తో కలిసి చాంద్రాయణగుట్ట నర్కి పూల్ బాగ్ లోని జోనల్ కమిషనర్ కార్యాలయంలో కార్పొరేటర్, పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, ప్రాజెక్ట్స్, రోడ్డు విస్తరణ, నాలా అభివృద్ధి నిర్మాణ పనులు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, వీధి దీపాలు తదితర విభాగాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ మాట్లాడుతూ... యాకుత్ పుర నియోజకవర్గం లోని రెయిన్ బజార్, తలాబ్ చంచలం, సంతోష్ నగర్, కుర్మగూడ డివిజన్ లలో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

రోడ్లు నిర్మాణ, నాలాలా విస్తరణ పనులు , పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, డ్రైనేజీ , టౌన్ ప్లానింగ్ ల సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే చేపట్టి స్థానిక బస్తి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశం లో సంతోష్ నగర్, తలబ్ చంచలం, పత్తార్ గట్టి, రెయిన్ బజార్, మొఘల్ పురా డివిజన్ల కార్పొరేటర్లు ముజాఫర్ హుస్సేన్, డాక్టర్ సమీనా బేగం, సయ్యద్ సోహెల్ ఖాద్రీ , మహమ్మద్ వసియుద్దీన్, నస్రీన్ సుల్తానా, జోనల్ ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, సంతోష్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ మహమ్మద్ అబ్దుల్ మాజీద్, చార్మినార్, సంతోష్ నగర్, మలక్ పేట్ సర్కిళ్ల ఈ ఈ లు హరి కిషోర్, ఏకంబరం, ఫీర్ సింగ్, ఈ ఈ (ఎలెక్ట్రికల్) రామారావు, ఏ సీ పీ స్వామి నాయక్, ఏ యం హెచ్ ఓ డాక్టర్ రుద్ర శ్రీనివాస్, డాక్టర్ జ్యోతి, ప్రాజెక్ట్స్ ఈ ఈ లు గోపాల్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story