ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దిగ్గజ గాయకుడు కన్నుమూత

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-09 16:21:08.0  )
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దిగ్గజ గాయకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమ(Film industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలయాళ(Mollywood) దిగ్గజ గాయకుడు పి.జయచంద్రన్(80)(P. Jayachandran) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కేరళలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాల పాలు ఇండస్ట్రీలో రాణించిన ఆయన.. తెలుగు, తమిళ్, మలయళం, కన్నడ, హిందీ భాషల్లో 16 వేలపై పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందారు. ఐదుసార్లు కేరళ రాష్ట్ర పురస్కారం దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

Next Story