Russia: పిల్లలకు జన్మనిస్తే రూ. 81 వేల బహుమానం.. రష్యాలోని కరేలియా రీజియన్ ఆఫర్

by vinod kumar |
Russia: పిల్లలకు జన్మనిస్తే రూ. 81 వేల బహుమానం.. రష్యాలోని కరేలియా రీజియన్ ఆఫర్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో జననాల రేటు వేగంగా పడిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రష్యాలోని కరేలియా రీజియన్ (Karelia Region) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చే 25 ఏళ్లలోపు మహిళా విద్యార్థినులకు100,000 రూబిళ్లు (సుమారు రూ. 81,000) బహుమానం అందిస్తామని ప్రకటించింది. దరఖాస్తుదారులు 25 ఏళ్లలోపు ఉండి తప్పనిసరిగా స్థానిక విశ్వవిద్యాలయం, కళాశాలలో పూర్తి సమయం విద్యార్థులుగా చేరడంతో పాటు కరేలియా నివాసితులు అయి ఉండాలి. అయితే చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు ఈ ఆఫర్ వర్తించబోదని తెలిపింది. ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (SIDS) కారణంగా బిడ్డ మరణిస్తే, చెల్లింపు రద్దు చేయబడుతుందా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

కాగా, రష్యా జనన రేటు కనిష్ట స్థాయికి చేరుకుంది, 2024 మొదటి అర్ధభాగంలో కేవలం 5,99,600 మంది పిల్లలు మాత్రమే జన్మించారు. 25 ఏళ్లలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. అలాగే 2023 కంటే 16,000 తక్కువ. దీంతో రష్యాలోని ఇతర ప్రాంతాల్లోనూ యువతులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేలా ప్రోత్సాహకాలతో ఆకర్షిస్తున్నారు. సుమారు పదకొండు ప్రాంతీయ ప్రభుత్వాలు ఈ తరహా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక ప్రసూతి చెల్లింపులను సైతం రష్యా ప్రభుత్వం భారీగా పెంచింది.

Advertisement

Next Story