‘గత ఐదేళ్లు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేశారు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘గత ఐదేళ్లు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేశారు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్‌లో(Irrigation Camp Office) హంద్రీనీవా ప్రధాన కాలువ లైనింగ్ మరియు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్-హంద్రీనీవా(Reservoir-Handriniva) లింక్ పనులపై అధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్,ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ఐదేళ్ళు హంద్రీనీవా ప్రాజెక్టును గాలికొదిలేసి రాయలసీమ రైతాంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2629 కోట్లతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) హంద్రీనీవా ప్రాజెక్టు(Handriniva Project) పనులు పునః ప్రారంభించారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగు నీరందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేసి, వచ్చే సీజన్ నాటికి సాగు, తాగు నీరందించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.



Next Story

Most Viewed