తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య...

by Sumithra |
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య...
X

దిశ, మణుగూరు : రాత్రులు ఎందుకు తిరుగుతున్నావు.. రా అని ఓ తండ్రి తన కొడుకును మందలించినందుకు కొడుకు డిగ్రీ కళాశాలలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే మహేష్ అనే ఓ వ్యక్తి కొత్తగూడెంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గతంలో ఓ చోరీ కేసు విషయమై మంగళవారం కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో మణుగూరుకు మూడు రోజుల క్రితం ముందుగానే వచ్చాడని కొంత సమాచారం.

అయితే మహేష్ తండ్రి శ్రీశైలం కొడుకుని రాత్రులు ఎందుకు తిరుగుతున్నావని, ఫోన్ ఎక్కడ పెట్టావ్.. తీసుకురా పోరా.! అని మందలించడంతో మహేష్ మనస్థాపానికి గురై మంగళవారం మణుగూరులోని డిగ్రీ కాలేజ్ లో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయం పై ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story