Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి 'కొండ దేవర' సాంగ్ వచ్చేసింది

by Prasanna |   ( Updated:2025-01-08 15:35:03.0  )
Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి కొండ దేవర సాంగ్ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) హీరోగా తెరెకెక్కిన సినిమా " గేమ్ ఛేంజర్ "( Game Changer ). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మూవీ పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే సముద్రఖని, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్, జయరామ్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర, ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలన్ని హిట్ అయ్యాయి. ఇక తాజాగా " కొండ దేవర " లిరికల్ లిరికల్ వీడియోను షేర్ చేశారు.

Read More ...

Ram Charan: ‘ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా’.. గ్లోబల్ స్టార్ షాకింగ్ కామెంట్స్





Advertisement

Next Story

Most Viewed