- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మహిళల శరీరాకృతిపై కామెంట్స్ కూడా లైంగిక వేధింపులే’.. హైకోర్టు సంచలన తీర్పు
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో ఇటీవల మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో మహిళల లైంగిక వేధింపుల కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. శరీర నిర్మాణం పై కామెంట్స్ చేస్తే మహిళల గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించినట్లేనని కేరళ కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో అలాంటి వ్యాఖ్యలు లైంగిక వేధింపులు(Sexual Harassment)గానే పరిగణించాలి అని కింది కోర్టులకు సూచించింది. అయితే.. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి(Former Employee) దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ(Kerala) ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో ఓ సీనియర్ ఉద్యోగి తన పై వేధింపులకు పాల్పడ్డాడు అని ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. 2013 నుంచి అసభ్య పదజాలంతో తనను దూషించాడని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు అసభ్యకరమైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతని పై లైంగిక వేధింపుల(Sexual Harassment) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసు పై మాజీ ఉద్యోగి కేరళ హైకోర్టు(Kerala High Court)ను ఆశ్రయించారు. శరీరాకృతి పై చేసిన కామెంట్స్ లైంగిక వేధింపులుగా చూడొద్దంటూ ఆయన కోర్టును కోరారు. లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో పిటిషన్ ను విచారించిన కోర్టు.. మహిళల శరీరాకృతి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం కూడా లైంగిక వేధింపుల కిందికే వస్తుందని కేరళ హైకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చింది.