మీడియా రంగంలోనే నూతన ఒరవడిని సృష్టించిన పత్రిక "దిశ " ..

by Sumithra |
మీడియా రంగంలోనే నూతన ఒరవడిని సృష్టించిన పత్రిక దిశ  ..
X

దిశ, చెన్నూర్ : మీడియా రంగంలో చాలా తక్కువ సమయంలో నూతన ఒరవడిని సృష్టించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పత్రిక దిశ పత్రిక అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో దిశ పత్రిక 2025 వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా నిగ్గు తెలుస్తూ పాలకపక్షం, ప్రతిపక్షం అని తేడా లేకుండా సమాజంలో జరుగుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ప్రజల మన్ననలు పొందుతున్నదని ఆయన అన్నారు. దిశ పత్రికలో ప్రతి పేజీలో కూడా విలువైన సమాచారం ఉంటుందని, డిజిటల్ మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ప్రధాన పత్రికలకు దీటుగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో దిశ పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన దిశ యజమానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed