అడవి పందుల నుండి పంటకు రక్షణగా చీరలు...

by Sumithra |
అడవి పందుల నుండి పంటకు రక్షణగా చీరలు...
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో మాక్క, వరి, కూరగాయలు తదితర పంటలను సాగుచేస్తారు. పంటను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. వాటి బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. రంగురంగు పాత చీరలను పోగుచేసి పొలాల చుట్టు కంచె కడుతున్నారు. ఎకరాకు 50 నుంచి 70 వరకు చీరలు పడుతున్నాయని, రంగు రంగు చీరలు దూరం నుంచి చూసిన అడవి పందులు పొలాల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతు ముక్కెర మాట్లాడుతూ పందుల బెడద నుండి రక్షించుకోవడానికి చీరలు ఉపయోగపడుతున్నాయని దిశ ప్రతినిధికి తెలిపారు.

Advertisement

Next Story