ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చారిత్రాత్మకం.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి..

by Sumithra |
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చారిత్రాత్మకం.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి..
X

దిశ, వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ సమావేశంలో భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సహాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 12 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అదే రోజు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా అదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సహాయం అందజేయనుందన్నారు.

Advertisement

Next Story