డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్ లక్ష్యం: విబి కమలాసన్‌రెడ్డి

by Mahesh |
డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్ లక్ష్యం: విబి కమలాసన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువత పాలిట శాపంగా మారుతున్న డ్రగ్స్‌ను తుది ముట్టించడానికి ఎక్సైజ్‌ శాఖలో కొత్తగా నార్కోటిక్‌ ఎన్‌డీపీఎస్‌ (Narcotic Drugs and Psychotropic Substances) కంట్రోల్‌కు ప్రత్యేక టీం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. నార్కోటిక్‌ టీమ్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో ఎన్‌ ఫోర్స్‌, డిటిఎఫ్, డిటిఎఫ్ టీమ్‌లో చురుకుగా పని చేస్తున్న వారిలో మంచి నైపుణ్యం కనబ రుస్తున్న వారితో పాటు, ఈ విభాగంలో పని చేయడానికి ఉత్సహాం చూపేవారిని తీసుకోవాలని డైరెక్టర్‌ అదేశించారు. టీమ్‌లో సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిసి మొత్తంగా 15 నుంచి 20 మంది సిబ్బంది ఉండే ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యిందని తెలిపారు.

నాలుగు స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ల్లో రెండు టీమ్‌లు సివిల్‌ పోలీస్‌ విభాగం నుంచి , మరో రెండు టీమ్‌లు ఎక్సైజ్‌ శాఖ నుంచి పని చేస్తున్నాయని తెలిపారు. పోలీస్‌ ఎస్టీఎఫ్ టీమ్‌లను అడిషనల్‌ ఎస్పీతోపాటు, ఇద్దరు డీఎస్పీలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. మరో రెండు టీమ్‌లకు ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. నార్కోటిక్‌ టీమ్‌ ఏర్పాటుకు ప్రధానంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో డ్రగ్స్‌ వినియోగం పెరుగడం అని తెలిపారు. నార్కోటిక్‌ టీమ్‌ ప్రధానంగా మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పని చేస్తుందన్నారు. నల్లమందు మార్ఫిన్‌, హెరాయిన్‌, గంజాయి, కోకైన్‌, హషిస్‌ అయిల్‌, పాపిష్టతో పాటు ఇతర డ్రగ్స్‌కు సంబంధించిన వాటిపై ప్రత్యేకంగా ఈ టీమ్‌ను నియమించడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Advertisement

Next Story