Addanki Dayakar : దొంగల హక్కుల కోసం కోర్టులు బాసటగా ఉండవు : అద్దంకి దయాకర్

by Y. Venkata Narasimha Reddy |
Addanki Dayakar : దొంగల హక్కుల కోసం కోర్టులు బాసటగా ఉండవు : అద్దంకి దయాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : కోర్టు(Courts)లు మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు..చట్టాల పరిరక్షకు బాసటగా ఉంటాయిగాని దొంగల హక్కుల కోసం, అవినీతి పరుల రక్షణ కోసం చేసే పోరాటాలకు బాసటగా ఉండవన్న సంగతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)గుర్తురెగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(Addanki Dayakar)అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని దయాకర్ స్వాగతించారు.

అవినీతి జరిగిన చోట అసలు విచారణ వద్ధని కేటీఆర్ కోర్టుకు వెళ్లడం..కోర్టు దాన్ని తిరస్కరించడం మంచి ప్రజాస్వామిక పరిణామమన్నారు. దొంగతనం చేశాక అది దొంగతనం కాదు అని శతవిధాల నిరూపించడం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తుండం మనం చూస్తున్నామన్నారు.

ప్రభుత్వంగా ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం..ఇష్టానుసారం ప్రైవేట్ సంస్థలకు నిధులు కట్టబెట్టడం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. ప్రజాప్రతినిధులుగా ఆ సోయి మరిచిపోయి తిరిగి కోర్టును ఆశ్రయించడం సరికాదని, కోర్టు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందని దయాకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed