కేటీఆర్, షర్మిల డైలాగ్స్‌తో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘రాచరికం’ ట్రైలర్.. యాక్టింగ్ అదరగొట్టిన అప్సర రాణి

by Hamsa |
కేటీఆర్, షర్మిల డైలాగ్స్‌తో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘రాచరికం’ ట్రైలర్.. యాక్టింగ్ అదరగొట్టిన అప్సర రాణి
X

దిశ, సినిమా: ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి(Apsara Rani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాచరికం’(Racharikam). ఇందులో వరుణ్ సందేశ్(Varun Sandesh), విజయ్ శంకర్ కీలక పాత్రలో కనపించనున్నారు. అయితే ఈ సినిమాను సురేష్ లంకెలపల్లి(Suresh Lankalapally) తెరకెక్కిస్తుండగా.. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Chill Bros Entertainments) బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అప్సర రాణి ఎన్నడూ లేని విధంగా విభిన్న పాత్రలో కనిపించనుంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ‘రాచరికం’ మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అప్సర రాణి పొలిటిషన్స్ డైలాగ్స్‌తో అదరగొట్టింది. ఇందులో కేటీఆర్(KTR) డైలాగ్ ‘‘సీఎం అవ్వాలంటే జైలుకి వెళ్లాలి’’ అని ఉండడంతో పాటు జగన్ చెల్లెలు షర్మిల ‘‘ఆడపిల్ల ఈడ పిల్ల గాదు’’ అనే డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ‘రాచరికం’ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 1వ తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది.



Advertisement

Next Story

Most Viewed