దేనికైనా సిద్ధమే.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-03-27 03:30:51.0  )
దేనికైనా సిద్ధమే.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, అందుకోసం దేనికైనా సిద్ధమని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి(Financial situation) బాగోదని, సూపర్ 6 పథకాల(Super 6 Schemes) కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. తాను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాయని, కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పారు. పథకాల అమలు కోసం కేంద్ర ఆర్థికమంత్రి(Finance Minister)ని పదే పదే కలవాల్సి వస్తోందని తెలిపారు. కూటమిలోని నేతలందరికీ అధికారులు గౌరవం ఇవ్వాలని చెప్పారు. తప్పుడు పనులను ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడా వేధింపులు ఉండొద్దని చెప్పారు. నాలా వల్ల చాలా చోట్ల లే అవుట్లు ఆలస్యమవుతున్నాయని, అందువల్ల ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Next Story

Most Viewed