Tamannah Bhatia: విజయ్ వర్మతో బ్రేకప్.. నిర్మాతతో హాట్ ఫొటోషూట్ చేసి పండుగపూట షాక్ ఇచ్చిన తమన్నా

by Hamsa |   ( Updated:2025-03-30 11:55:48.0  )
Tamannah Bhatia: విజయ్ వర్మతో బ్రేకప్.. నిర్మాతతో హాట్ ఫొటోషూట్ చేసి పండుగపూట షాక్ ఇచ్చిన తమన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannah Bhatia) ‘శ్రీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత హ్యాపీడేస్(Happy Days), కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100%లవ్, అవారా వంటి మూవీస్ చేసి తన క్రేజ్‌ను పెంచుకుంది. దీంతో తమన్నాకు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్(Prabhas), మహేష్ బాబు, చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి వారితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. మీల్కీ బ్యూటీగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అంతేకాకుండా జైలర్, స్త్రీ-2 వంటి మూవీస్‌లో ఐటమ్ సాంగ్స్ చేసి తన డ్యాన్స్‌తో ఓ ఊపు ఊపేసింది. గత ఏడాది ‘సికందర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తమన్నా భాటియా ‘ఓదెల-2’(Odela-2)మూవీలో నటిస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నాగసాధువుగా కనిపించనుంది. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి రానుంది.

ఈ నేపథ్యంలో.. తమన్నా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. నిత్యం పలు ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, తమన్నా తన ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లాక్ ధరించిన ఆమె మత్తెక్కించే కల్లతో మెస్మరైజ్ చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో క్లోజ్‌గా ఉండగా.. అతను నడుముపై చేతి వేసి మరీ ఫొటోకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా, విజయ్ వర్మ, తమన్నా గత కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పుకుని విడిపోయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తమన్నా హాట్ ఫొటో షూట్ చేయడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed