- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్ వచ్చేస్తుందోచ్.. వీడియోతో క్యూరియాసిటీ పెంచేసిన మూవీ టీమ్

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika [pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai). ఇక ఈ చిత్రాన్ని నితిన్, భరత్‌లు తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్(Trailer) అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ ప్రదీప్ మాచిరాజు జీవితంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిచే ట్రైలర్ లాంచింగ్ చేయిస్తున్నాము.. ఇక ఈ ట్రైలర్ రేపు విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు.
ఇక ఆ వీడియోలో.. ప్రదీప్ తన అమ్మని ఇంట్లో నుంచి తీసుకువచ్చి.. హాల్‌లో కూర్చోబెట్టి నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అమ్మా.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్ లాంచ్ చేయాలి’ అని అంటాడు. అప్పుడు వాళ్ల అమ్మ చేయమ్మా ఆల్ ది బెస్ట్ అని చెబుతుంది. అప్పుడు ప్రదీప్ చేయమ్మా కాదు చేయాలమ్మా అని తన మదర్‌ని చూపిస్తాడు. అప్పుడు ఆమె ఎవరు అని అడిగితే.. నువ్వే అమ్మా అని అంటాడు ప్రదీప్. వెంటనే వాళ్ల అమ్మ నేను సెలబ్రిటీని కాదు అని అంటది. అప్పుడు ప్రదీప్ నాకు నువ్వే సెలబ్రిటీవి అని అంటాడు. దీంతో అప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అనే మ్యూజిక్ వస్తుంది.
తర్వాత వాళ్ల అమ్మ నేను ట్రైలర్ లాంచ్ చేయాలంటే మూడు మంచి రీసన్స్ చెప్పు అని అంటది. అప్పుడు ప్రదీప్ మాచిరాజు మూడు కాదు 1000 చెప్తా అని 1. 7వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అన్నావ్ తెచ్చుకున్న అని అంటుండగానే అప్పుడు నాతో సైకిల్ కొనిచ్చుకున్నావ్‌గా అని జవాబు ఇస్తది. అలా చాలా రీసన్స్ చెప్తాడు. ఫైనల్‌గా నువ్వు నా కొడుకురా ఈ ఒక్క రీసన్ చాలు ట్రైలర్ లాంచ్ చేయడానికి అని ప్రదీప్‌ను ముద్దుపెట్టుకుంది. దీంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది.