Mahesh Babu: ‘SSMB-29’ రిలీజ్ డేట్ లాక్.. ఫుల్ ఖుషీలో సూపర్‌స్టార్ ఫ్యాన్స్!

by Hamsa |
Mahesh Babu: ‘SSMB-29’ రిలీజ్ డేట్ లాక్.. ఫుల్ ఖుషీలో సూపర్‌స్టార్ ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గత ఏడాది ‘గుంటూరు కారం’ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ భారీ కలెక్షన్లు కూడా రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే ఫామ్‌లో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ మహేష్ బాబు మాత్రం గత కొద్ది రోజుల నుంచి ఎవరికీ కనిపించకుండా పలు విద్యలు నేర్చుకుంటున్నారు. ఆయన సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ ‘SSMB-29’ తన మేకోవర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు నిత్యం పలు పోస్టులు పెట్టడంతో పాటు రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆయన అప్పుడప్పుడు పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘SSMB-29’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 2027 మార్చి 25వ తేదీన తీసుకురాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అవి చూసిన సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కావచ్చు అందుకే ఇంత టైమ్ తీసుకుంటున్నారు లేట్ అయినా పర్లేదు కానీ ఈ సారి బాక్సాఫీసు షేక్ చేసే ప్లాన్‌లోనే మేకర్స్ ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed