- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Data Protection: డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్.. కీలక నిబంధనలివే?
దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (Deta protection act) ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023లోని సెక్షన్ 40 (1), (2)లో పొందుపర్చిన అధికారాలను వినియోగించుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముసాయిదాను రూపొందించినట్టు పేర్కొంది. దీని ప్రకారం..18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే ప్రజల ఆమోదం, డేటాను వినియోగించే కంపెనీలు, అధికారుల పని తీరు గురించి వివరించారు. అయితే ఈ రూల్స్ ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న వివరాలను ముసాయిదాలో పొందు పర్చలేదు.
ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలుంటే mygov.inలో తెలియజేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఫిబ్రవరి 18 వరకు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపింది. అనంతరం ముసాయిదాను మరోసారి పరిశీలిస్తామని స్పష్టం చేసింది. కాగా, ఈ చట్టాన్ని 2023 ఆగస్టులో లోక్‌సభ ఆమోదించింది. అయితే ఇది గోప్యత హక్కును ఉల్లంఘించిందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో కేంద్రం పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులకు పంపించింది.