అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాం.. ఎమ్మెల్యే

by Sumithra |
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాం.. ఎమ్మెల్యే
X

దిశ, భూదాన్ పోచంపల్లి : అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దేవనపల్లిలో గల డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో అద్దాలు, దర్వాజాలు, నల్లాలు పూర్తిగా ధ్వంసమయాయాన్ని అన్నారు. హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ తో చర్చించి నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 660 డబుల్ బెడ్ రూమ్ లు ఉన్నాయని, రేవనపల్లిలో 120, జిల్లక్ పల్లిలో 60 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా స్థానిక బసవలింగేశ్వర స్వామి కాలనీలో నివాసముంటున్న కుటుంబాలకు ధ్రువీకరణ పత్రాలు, ఇంటి నెంబర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మర్రి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బారత లవ కుమార్, నాయకులు తడక రమేష్, కొట్టం కరుణాకర్ రెడ్డి, గుణికంటి వెంకటేష్ గౌడ్, మక్తాల నరసింహ, చింతకుంట్ల కృష్ణారెడ్డి, కర్నాటి పురుషోత్తం, రావుల జంగయ్య, రుద్ర చంద్రశేఖర్, జింకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed