- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trump: 51వ రాష్ట్రంగా ఉండాలని ప్రజలే కోరుతున్నారు.. ట్రూడో రాజీనామాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)పై అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా (Canada) 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను ఆయన మరోసారి నొక్కి చెప్పారు. ‘అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలని అక్కడి ప్రజలే కోరుకుంటున్నారు. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి మా దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదు. ఆ దేశ ప్రధాని ట్రూడోకు ఈ విషయం తెలుసు కాబట్టే రాజీనామా చేశారు. కెనడాలో అమెరికాలో భాగమైతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి. అంతేకాక రష్యా, చైనాలకు చెందిన షిప్‌ల నుంచి ఎలాంటి ముప్పు ఉండదు’ అని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో రాసుకొచ్చారు.
ట్రూడోపై విమర్శలు
ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత కెనడా ప్రధాని ట్రూడో (Trudeau).. ట్రంప్ (Trump)తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికా(USA)లో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు సూచించారు. ఈక్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోపై చురకలు అంటిస్తూ విమర్శించారు. మరోవైపు.. ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.