నటి జత్వానీ కేసులో కీలక పరిణామం.. వారికి ముందస్తు బెయిల్

by Mahesh |
నటి జత్వానీ కేసులో కీలక పరిణామం.. వారికి ముందస్తు బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ(Actress Jatwani) కేసు(Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్, పోలీస్ అధికారులతో పాటు, అడ్వకేట్‌కు ఏపీ హైకోర్టు(AP High Court) ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది. కాగా గతంలో జత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారులు(IPS officers) కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారించిన కోర్టు మంగళవారం ఐదుగురికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed