- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ACB Raids: కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్.. గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు సోదాలు
దిశ, వెబ్‌డెస్క్/ శేరిలింగంపల్లి: ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E-Car Racing) కేసులో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition)ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ క్రమంలోనే తీర్పు రాగానే ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఫార్ములా ఈ-రేస్‌తో సంబంధం ఉన్న గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో ఏక కాలంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మాదాపూర్‌లోని ఏస్ నెక్ట్స్ జెన్, ఏస్ అర్బన్ రేస్, మచిలిపట్నంలోని ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. అయితే, ఇవాళ గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ సంస్థలో సోదాలు పూర్తి చేసి.. పక్కా ఆధారాలతో ఈ నెల 9న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
కాగా, ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఇటీవల ప్రభుత్వం ఆరోపించింది. బీఆర్ఎస్ (BRS)కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్ కో (Green Co) సంస్థ ముట్టచెప్పినట్లుగా వెల్లడించింది. ఆ కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలిపింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు కలిసి 41 సార్లు దాదాపు రూ.49 కోట్లను బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి చందాల రూపంలో ఇచ్చినట్లుగా గుర్తించింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్ల (Election Bonds)ను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. ప్రతిసారి రూ.కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వం ఆరోపించింది.