గీసుకొండ కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

by Mahesh |
గీసుకొండ కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉపముఖ్యమంత్రి(Deputy Chief Minister of Telangana) భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో గీసుకొండ(Geesukonda) మండలం విశ్వనాధపురం గ్రామంలో రూ.8కోట్ల 40 లక్షలతో నిర్మించే మూడు 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ప‌నుల‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ప్రజలను మోసం చేసిందని, ధనిక రాష్ట్రాన్ని ప్రజలు బీఆర్ఎస్(BRS) చేతిలో పెడితే లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. పది సంవత్సారలు పాలించిన బీఆర్ఎస్ 7 లక్షల అప్పు చేసి కూడా రుణమాఫీ(Loan waiver) చేయలేక చేతులు ఎత్తేసిందని అన్నారు.

ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను నిబద్ధతతో అమలు చేస్తుందని, రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోతే అలాంటి వారికి కూడా తప్పకుండా రుణమాఫీ(Loan waiver) చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో హరీష్ రావు, కేటీఆర్(KTR) అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ సందర్భం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయంపై దృష్టి పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ (Bonus) ఇచ్చి ప్రోత్సహిస్తుందని.. ఎవరు అడ్డుపడినా.. ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసాను ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story