- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళను నమ్మించి మోసగించిన మాజీ సర్పంచ్ అరెస్టు
దిశ, వేములవాడ టౌన్ : ఓ కేసు విషయంలో సాయం చేస్తానని మహిళను నమ్మించి మోసగించిన విషయంలో మాజీ సర్పంచ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాలానగర్ కు చెందిన సయ్యద్ యాకూబ్ బి అనే మహిళ తన భర్త హైదర్ పై కొద్దిరోజుల క్రితం కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో సహాయం చేస్తానని, ఇరువురి మధ్య ఉన్న సమస్యను పరిష్కరిస్తానని కోనరావుపేట మండలం మంగళ్ళపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పుల శ్రీనివాస్ సదరు మహిళను నమ్మబలికాడు.
ఈ క్రమంలో ఆమె దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ కాగితాలు తీసుకుని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నాడు. పోలీసులకు, కోర్టుకు డబ్బులు ఇవ్వాలని ఆమెను బెదిరించి ఆమె దగ్గర రూ. 30 వేలు తీసుకున్నాడు. ఆమె భర్తతో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెబుతూ తరచూ ఆమెను లైంగికంగా వేధించసాగాడు. లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు. ఈ క్రమంలో యాకుబ్ బి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.