- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Multi Vitamins: మల్టీ విటమిన్లు ఉండే ఆహారాలు.. తింటే హెల్త్ బెనిఫిట్స్ బోలెడు
దిశ, వెబ్‌డెస్క్: ఒక్కో ఆహారంలో పలు రకాల విటమిన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. కొన్ని ఆహారాల ద్వారా శరీరానికి విటమిన్లు అందడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే ఏఏ ఆహారాల్లో మల్టీవిటమిన్లు ఉంటాయో తాజాగా నిపుణులు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, ఇ, సి, కె విటమిన్లు దండిగా ఉంటాయి. ఇందులో ఐరన్, ఫోలేట్,మెగ్నీషియం, క్యాల్షియం కూడా లభిస్తాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే బాదం ఒకటి. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఇ,మెగ్నీషియం ఉంటాయి. వీటితో పాటుగా ప్రతిరోజూ కంది, చిక్కుళ్లు, శనగ, పెసర, రాజ్మా వంటివి కూడా తీసుకోవాలి. వీటిల్లో బి 1, బి6 ఫోలేట్ అధికంగా ఉంటాయి.
పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలుండే ప్రోటీన్, పీచు సైతం దట్టంగా ఉంటుంది. అలాగే గుడ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. ఎగ్స్ లో విటమిన్ డి, బి 12 , సెలీనియం, ఖొలీన్, బయోటిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సజ్జలు, సామలు తినాలి. వీటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్ ఉంటాయి.
అలాగే మల్టీ విటమిన్లు అధికంగా ఉండే విటమిన్ సి, దట్టంగా ఉండే జామ, రేటు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తింటే కండరాల పనితీరు మెరుగుపడుతుంది. వీటితో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.