- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆస్కార్ రేసులో రెండు సౌత్ ఇండియా సినిమాలు
దిశ, వెబ్ డెస్క్: అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ & సైన్సెస్ 2025 ఆస్కార్(Oscar) నామినేషన్‌ల కోసం మరో రెండు రోజుల్లో ఓటింగ్(Voting) ప్రారంభం కానుంది. ఈ ఓటింగ్ కు 2024 సంవత్సరంలో రిలీజ్ అయిన 323 చలనచిత్రాలు అర్హత సాధించాయి. అయితే వీటిలో కేవలం 207 మాత్రమే ఉత్తమ చిత్రాలుగా నిలిచి పోటీకి అర్హత(Eligibility for competition) పొందాయి. ఇందులో తమిళ సూపర్ స్టార్ సూర్య(Surya) హీరోగా నటించిన "కంగువా"(kangua")సినిమాతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించిన 'ఆడు జీవితం(The Goat Life)' కూడా ఆస్కార్ రేసులో స్థానం దక్కించుకున్నాయి. దీంతో ఈ సారి భారత్‌కు మరిన్ని ఆస్కార్ అవార్డులు(Oscar Awards) వచ్చే అవకాశం కనబడుతుంది.
97వ అకాడమీ ఆస్కార్ అవార్డుల నిబంధనలు
“97వ అకాడమీ అవార్డుల సంవత్సరానికి అమలు చేయబడిన నిబంధనల ప్రకారం సాధారణ ప్రవేశ వర్గాలలో పరిశీలనకు అర్హత పొందాలంటే, చలనచిత్రాలు తప్పనిసరిగా కనీసం ఆరు U.S. మెట్రోపాలిటన్‌లలో ఒక వాణిజ్య చలనచిత్ర థియేటర్‌లో షోలు ఆడాల్సీ ఉంది. లాస్ ఏంజిల్స్ కౌంటీ; న్యూయార్క్ నగరం; బే ఏరియా; చికాగో, ఇల్లినాయిస్; డల్లాస్-ఫోర్ట్ వర్త్, టెక్సస్; అట్లాంటా, జార్జియా, 2024 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 మధ్య , అదే వేదికలో వరుసగా ఏడు రోజుల పాటు సినిమాను ప్రదర్శించాలి. ఫీచర్ ఫిల్మ్‌లు తప్పనిసరిగా 40 నిమిషాల కంటే ఎక్కువ రన్నింగ్ టైమ్‌ని కలిగి ఉండాలి. ఆస్కార్ నామినేషన్ల ఓటింగ్ జనవరి 8, బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై జనవరి 12, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
పోటీకి అర్హత సాధించిన సినిమాలు