ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు...ఒకరు మృతి

by Sridhar Babu |
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు...ఒకరు మృతి
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే రాజయ్య అనే వ్యక్తి పట్టణ పరిధిలోని మారుతీనగర్ లో నివాసం ఉండే గుడికందుల సంపత్(55) అనే వ్యక్తిని తన ద్విచక్ర వాహనంపై మారుతీనగర్ నుండి జమ్మికుంట వైపునకు తీసుకువస్తున్నాడు.

యూటర్న్ తీసుకునే క్రమంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపునకు వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో సంపత్ తలకు తీవ్ర గాయాలు కాగా, రాజయ్య కాళ్లు విరిగాయి. బాధితుల బంధువులు 108 కు సమాచారం ఇవ్వడంతో వెంటనే 108 ద్వారా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అయితే సంపత్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు పట్టణంలోని ఓ వైద్యురాలికి చెందినదిగా సమాచారం.

Advertisement

Next Story