జాతీయ రాజకీయాల్లో తెలుగువాళ్లు రాణించలేక పోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
జాతీయ రాజకీయాల్లో తెలుగువాళ్లు రాణించలేక పోతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ(HICC) ప్రపంచ తెలుగు సమాఖ్య(World Telugu Federation) 12వ వార్షికోత్సవ సదస్సు(12th Anniversary Conference)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆహ్వానం పలికినందుకు ఇంతటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అలాగే ఈ ప్రపంచ తెలుగు సమాఖ్యను మాజీ సీఎం నందమూరి తారక రామారావు(Former CM Nandamuri Taraka Rama Rao) ప్రారంభించారని.. మొదటి సమావేశం హైదరాబాద్‌లోనే జరగ్గా.. తిరిగి 12వ సమావేశం హైదరాబాద్‌లో జరగడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమ ద్వారం ఇతర దేశాల్లో సెటిల్ అయిన వారిని భారత్ తీసుకొచ్చి.. దేశ భవిష్యత్తు కోసం చర్చించేందుకు ఈ సదస్సు వేదిక అయిందని అన్నారు.

అలాగే దేశంలోనే అత్యధికంగా మాట్లాడే బాషల్లో రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రజలు జాతీయ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా నిలిచిందని సీఎం గుర్తు చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామారావు, పీవీ నరసింహారావు, కాకా వెంకటస్వామి, నీలం సంజీవరెడ్డి లు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, చట్ట సభల్లో తెలుగు ప్రతినిధులు మాట్లాడే పరిస్థితి లేదని గుర్తు చేశారు. అలాగే తెలుగు సినిమా రంగం ప్రపంచ స్థాయిలో నిలిచిందని ఈ రంగంలో తెలుగు వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అలాగే ప్రజలు తమ అవసరాలకు ఎన్ని బాషలు నేర్చుకున్నప్పటికి మాతృభాష అయిన తెలుగులో మాట్లాడాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీ.. ప్రపంచంలోని వివిధ నగరాలతో పోటీలో నిలుస్తుందని తెలిపారు.

Advertisement

Next Story