న్యూఇయర్ వేళ ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

by Gantepaka Srikanth |
న్యూఇయర్ వేళ ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూఇయర్ వేడుకల వేళ ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఓ బైకు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండెపల్లి వద్దనున్న కడెం ప్రధాన కాలువ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిచెందిన యువకులను వెలికితీశారు. మృతులు రాజు(30), పవన్(28)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story