సంక్రాంతికి భారీగా నడపనున్న ప్రత్యేక బస్సులు

by Naveena |
సంక్రాంతికి భారీగా నడపనున్న ప్రత్యేక బస్సులు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థమై 10 ఆర్టీసీ డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట నుండి 32,గద్వాల నుండి 35,కల్వకూర్తి నుంచి 32, కొల్లాపూర్ నుండి 31,కోస్గీ నుండి 3 బస్సులను,అలాగే మహబూబ్ నగర్ నుండి 42,నాగర్ కర్నూల్ నుంచి 32,నారాయణపేట నుంచి 33,షాద్ నగర్ నుండి 40,వనపర్తి నుండి 40 ప్రత్యేక బస్సులను,ఈ నెల 8 నుండి 13 వరకు నడపనున్నట్లు ఆయన వివరించారు. ప్రయాణికుల రద్ధీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని బస్సులను నడుపుతామని,బస్ స్టాండ్,ఆయా పాయింట్లలో ప్రయాణికులకు త్రాగునీరు,వాలంటీర్లు,అదనపు సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తామని,ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించకుండా,సురక్షిత ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్ఎం శ్యామల,పర్సనల్ ఆఫీసర్ సుజాత లు పాల్గొన్నారు.

Advertisement

Next Story